Minister Jagdish Reddy ధాన్యం కొనుగోళ్లలో వందల కోట్ల అవినీతి...

పత్తి, వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంటుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కొనుగోళ్లు జరపకుండా పథకం ప్రకారం రైతులను దళారీలకు, మిల్లర్లకు వదిలేశారని విమర్శించారు. దీని వెనుక వందల కోట్ల అవినీతి జరిగింది. ప్రభుత్వంలో మంత్రులు దళారులు, మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారని మండిపడ్డారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ పండిన ప్రతి గింజను కొన్నారన్నారు. నల్గొండ జిల్లా మంత్రి రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను బెదిరించారని ఆరోపించారు. జిల్లా మంత్రి దళారులతో కుమ్మక్కై వందల కోట్లు వసూలు చేశారన్నారన్నారు. 2014 కు ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎందుకు దోపిడీకి గురి అవుతున్నారో సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ మాపైన దాడి జరగలేదని చెప్పారు. ప్రభుత్వం కేసులు ఎందుకు పెడుతున్నదని ప్రశ్నించారు. ఢిల్లీకి 25 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ఎవరి కాళ్లు మొక్కారో ప్రజలకు తెలుసన్నారు. కేటీఆర్ ఢీల్లికి వెళ్లింది కాంగ్రెస్, బీజేపీ పార్టీల బండారం బయటపెట్టడానికి అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com