Hyderabad : కూలర్ల గోదాంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగర వాసులను అగ్నిప్రమాదాలు భయపెడుతున్నాయి.. కార్వాన్‌లోని కూలర్స్ తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి.. కూలర్స్‌కు ఉపయోగించే గడ్డికి మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది.. జనావాసాల మధ్యలో ఫ్యాక్టరీ ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.. అటు మంటలను అదుపు చేసేందుకు ఫైర్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.. మొత్తం ఆరు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. గోడౌన్ లోపల ఎవరైనా కార్మికులు చిక్కుకుని ఉన్నారేమోనని పోలీసులు ఆరా తీస్తున్నారు.
మంటలు అంటుకున్న వెంటనే కార్మికులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. రెసిడెన్సీ ఏరియాలో మంటలు అంటుకోవడంతో స్థానికులు భయానికి లోనయ్యారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com