Hyderabad : గ్లోబలిసిటీగా హైదరాబాద్.. ట్రిలియన్ ఎకానమీ వైపు అడుగులు

హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2050కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్లోబల్ టెక్ హబ్ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. హైదరాబాద్ ను గ్రీన్ టెక్ సిటీగా తీర్చిదిద్దనుంది. తెలంగాణ రైజింగ్ 2050 లక్ష్యంగా రూ ట్రిలియన్ ఎకానమీ వైపు అడుగులు వేస్తోంది. డిజిటల్ తెలంగాణ కోసం మాస్టర్ ప్లాన్ లో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు పొందుపర్చింది. ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్ని కల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుంది. ఏఐ సిటీ కోసం 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్నాలజీ సిటీ ప్రణాళిక రూపొందించారు. ఐటీఐను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చనుంది. 65 ఐటీఐలలో టాటా టెక్నాలజీ భాగస్వామ్యంతో ప్రత్యేక కోర్సులు ప్రవేశ పెట్టనున్నారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో టెక్ ట్రైనింగ్ తో10,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుం ది. తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రానికి ఆధు నికీకరణ, హైదరాబాద్ ఐటీ & ఫినిక్ రంగాల్లో ఉపాధి వృద్ధి కేంద్రంగా ఎదుగుతుంది. బయోటెక్, ఫార్మా, ఈవీ తయారీలో గ్లోబల్ తయారీ హబ్ గా తెలంగాణ మారనుంది. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంలో టెక్ స్కిల్స్ పెంచనున్నారు. యువత కోసం టెక్, ఏఐలో ప్రాథమిక స్థాయి శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ప్రారంభించనున్నారు. కొత్తగా డిజిటల్ ప్లాట్ ఫాంలపై ఉపాధి అవకాశాలను విస్తరిస్తారు. 'తెలంగాణ: చైనా + 1’ విధానంతో ఇండస్ట్రీలో ముందుండే లక్ష్యంగా ముందుకెళ్లనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com