HYDRA : హైడ్రా కూల్చిన భవనాలు.. సీజ్ చేసిన భూముల లెక్క ఇదే

హైదరాబాద్ మహానగరంలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాల చిట్టాను ఒక్కొక్కటిగా విప్పుతూ.. అక్రమార్కుల గండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఏ రోజు, ఎప్పుడు హైడ్రా కూల్చివేతలు చేస్తుందో తెలియక కబ్జాదారుల్లో వణుకు పుడుతోంది. ఈ క్రమ్మలో కొందరు అయితే హైడ్రా నుంచి నోటీసులు అందక ముందే.. కోర్టులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తుంది.
నగర వ్యాప్తంగా ఇప్పటి వరకూ చేపట్టిన కూల్చివేతలపై తెలంగాణ ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ అందించింది. ఇప్పటి వరకూ 262 భవనాలు కూల్చివేసినట్టు లిస్ట్ రిలీజ్ చేసింది. 111 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. నంది నగర్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, లోటస్పాండ్, బీజేఆర్నగర్, ఎమ్మెల్యే కాలనీ, అమీర్పేట్, గాజులరామారంలో పలు నిర్మాణాలకు నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com