Hyderabad : హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల

Hyderabad : హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
X

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు నగారా మోగింది. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవి కాలం ముగియనుండటంతో షెడ్యూల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈనెల 28న నోటిఫికేషన్ రానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 4 నామినేషన్లకు చివరి తేదీ. ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్ 23న పోలింగ్ జరిపి ఏప్రిల్ 25న కౌంటింగ్ చేస్తారు.హైదరాబాద్ జిల్లా పరిధిలో బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీకి ఓట్లు ఉన్నాయి. అయితే మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags

Next Story