హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో గందరగోళం

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో గందరగోళం
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసినా ఎవరికి మెజార్టీ రాలేదు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసినా ఎవరికి మెజార్టీ రాలేదు. అయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతలో వచ్చిన బ్యాలెట్ పేపర్ల కన్నా.. రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో బ్యాలెట్ పేపర్లను ఎన్నికల సిబ్బంది తక్కువగా చూపుతున్నారని బిజెపి కాంగ్రెస్ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. 8 మంది ఎలిమినేషన్‌లో 50 ఓట్లు మిస్ అయినట్లు చూపుతుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బిజెపి, కాంగ్రెస్ ఏజెంట్లు.. ఆర్వోకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో బీజేపీ, కాంగ్రెస్‌ ఏజెంట్లు ఆందోళనకు దిగారు.. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొద్దిసేపు నిలిచిపోయింది..

Tags

Read MoreRead Less
Next Story