TG : రాత్రి ఒంటిగంట వరకు షాపులకు అనుమతి.. అసదుద్దీన్ హర్షం

హైదరాబాద్ పాత నగరంలో రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారాలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా మంది వ్యాపారులకు భారీ ఉపశమనం కలిగిస్తోందన్నారు. అసెంబ్లీలో మజ్లిస్ చేసిన వినతిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించడం శుభపరిణామమన్నారు.
గత కొద్ది నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసి వేయిస్తున్నారు పోలీసులు. రాత్రి 11 దాటిన తరువాత ఆహారం కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలా మంది నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం స్పందించింది. మద్యం దుకాణాలు మినహా ఇతర ఏ వ్యాపారమైనా రాత్రి ఒకటి వరకు నిర్వహించుకోవచ్చని అసెంబ్లీలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మద్యం దుకాణాల విషయంలో మినహాయింపులు ఉండబోవని తేల్చి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com