Hydra : హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య

Hydra : హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య
X

కూకట్ పల్లిలో ఓ మహిళ హైడ్రా అధికారులు తన ఇంటిని కూలుస్తారన్న భయంతో ఆత్మహత్య చేసుకుంది. కూకట్ పల్లి రామాలయం సమీపంలోని యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఇంటి కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చుతారేమో అనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ ఇంటికి హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు కుటుంబ సభ్యులు. కాగా స్థానికంగా ఉన్న నల్లచెరువు పరిధిలో పలు ఇండ్లు, షెడ్లను అధికారులు కూల్చివేశారు. తమ ఇళ్లు కూడా కూల్చేతారేమో అనే భయంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags

Next Story