Deputy CM : హైదరాబాద్ ను ఢిల్లీలా కానివ్వం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Deputy CM : హైదరాబాద్ ను ఢిల్లీలా కానివ్వం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

హైదరాబాద్ ను ఢిల్లీలా కాలుష్య కాసారం కానివ్వబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. హెచ్ ఐసీసీ లో ఐజీబీసీ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ కు ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సమక్షంలో టీఎస్ఐసి, క్రెడాయిన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పై ఎంవోయూ కుదుర్చకున్నాయి. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నగరంలో కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను ప్రోత్స హిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం బ్యాటరీ బైక్స్, కార్ లకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసేశామ న్నారు. భవిష్యత్ లో సిటీలో ఎలక్ట్రిక్ బస్సులే నడుపుతామని చెప్పారు. అన్ని వెహికిల్స్ ను దశల వారీగా ఈవీలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. అందుకే గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చినట్టు భట్టి చెప్పారు. మూసీని పునరుజ్జీవంతో మంచినీటి సరస్సుగా మార్చ నున్నామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ నిధులతో ఫ్లై ఓవర్లు, సబ్ వేలు నిర్మించనున్నట్టు తెలిపారు. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ చాలా మంచిదని, వీటిని నిర్మించేందుకు ముం దుకొచ్చే సంస్థలను ప్రోత్సహిస్తామని అన్నారు. హైదరాబాద్ నిర్మాణ సంస్థలకు స్వర్గధామం వంటిదని చెప్పారు. ఫ్యూచర్ సిటీ సీఎం డ్రీమ్ సీఎం డ్రీమ్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీ అని, దానిని ముచ్చర్లలో నిర్మించబోతున్నట్టు విక్రమార్క చె ప్పారు. దానిని నెట్ జీరో సిటీగా నిర్మించబోతు న్నట్టు చెప్పారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రమని అన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రపంచా న్ని ఆకర్షించబోతోందని అన్నారు.

Tags

Next Story