Manikonda Hydra : మణికొండ ఆక్రమణలపై హైడ్రా బుల్డోజర్లు

హైదరాబాద్‌లో హైడ్రా కొరడా తన పవర్ చూపుతోంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీలో పార్కు స్థలం కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. పార్క్ స్థలం కబ్జాకు గురైందని 15 రోజుల క్రితం హైడ్రా కార్యాలయంలో కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు డాలర్ హిల్స్ కాలనీ వాసులు. మే 14న డాలర్ హిల్స్ కాలనీ లో స్థలాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్. ఇవాళ ఆపరేషన్ చేపట్టారు. తెల్లవారుజామున భారీ బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు. పార్క్ కబ్జాకు గురైందని మూడు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ , హెచ్ఎండిఏ కార్యాలయం చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవలేదని స్థానికులు అన్నారు. హైడ్రాలో కంప్లైంట్ ఇచ్చిన 15 రోజులకే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సలాన్ని పరిశీలించడం.. చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు డాలర్ హిల్స్ కాలనీ వాసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com