TG : కబ్జా చేస్తే ఈ నంబర్లకు కాల్ చేయండి.. కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా అధికారులకు వందలాది ఫిర్యాదులు అందుతున్నాయి. గాజులరామారంలోని చింతల చెరువు బఫర్ జోన్ తో సహా 44.3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన చెరువు పుల్యాంక్ లెవెల్ (ఎఫ్ఎఎల్) పరిధిలో అక్రమంగా 52 నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా అధికారులు వాటిని కూల్చివేశారు.
జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ లేఅవుట్ లోని పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలను సైతం హైడ్రా సిబ్బంది తొలగించారు. చెరువులు, పార్కుల, రహదారుల పునరుద్ధరణతో పాటు, నీటి వనరుల పరిరక్షణ, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నామని ఏ వీ.రంగనాథ్ వివరించారు.
చెరువులు, రోడ్లు, వీధులను అక్రమంగా ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై సమాచారం ఇచ్చిన వెంటనే చర్యలు ప్రారంభిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తేల్చిచెప్పారు. పార్కు స్థలాలు, చెరువులు సహా ఇతర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ప్రభుత్వం స్థలాలు కబ్జాకు గురైనట్లు ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే 18005990099, 040-29560509, 040-29560596, 040-29565758, 040-295605930 కాల్ చేయాలని ఆయన తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ఎవ్వరూ ఎవరకీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. అలాగే తనను వ్యక్తిగతంగా కలిసేందుకు 7207923085 నంబర్ కు మెసేజ్ చేయాలని ఆయన సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com