Hydra Demolishes : రాయదుర్గంలో హైడ్రా కూల్చివేతలు

Hydra Demolishes : రాయదుర్గంలో హైడ్రా కూల్చివేతలు
X

హైదరాబాద్ వరస కూల్చివేతలతో అక్రమార్కుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరుగెత్తిస్తోంది. ఈ క్రమంలో పేద, ధనిక, సినిమా స్టార్లు, రాజకీయ నేతలు ఇలా ఎవరినీ వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది. తాజాగా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు సోమవారం కూల్చివేశారు.

రాయదుర్గం సర్వే నంబర్ 3, 4, 5, 72లోని ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా కట్టిన భవనాలను తొల గించారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలు చేపట్టారంటూ జీహెచ్ఎస్సీ టౌన్ ప్లానింగ్ అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ ఆందోళనకు దిగడంతో పాటు అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఎకరం స్థలంలో ఆక్రమణలు కూల్చివేసిన అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని అక్కడ ప్రభుత్వ బోర్డును ఏర్పాటు చేశారు.

Tags

Next Story