Hydra : జెట్ స్పీడ్ లో హైడ్రా కూల్చివేతలు
జెట్ స్పీడ్లో హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. ఆదివారం కూకట్పల్లిలోని నల్లచెరువు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను నేల మట్టం చేసిన హైడ్రా.. సోమవారం మాదాపూర్లో కూల్చివేతలు కొనసాగిస్తోంది. కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై గత కొంత కాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది.
వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ముందుగా స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను తొలగించారు. నిర్మాణాలను తొలగించిన అనంతరం కావూరిహిల్స్ పార్క్ అని అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. కాగా కావూరి హిల్స్ అసోషియషన్ నుంచి 25 ఏళ్లపాటు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు చెబుతున్నారు.
గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. జూన్ 26 నుంచి హైడ్రా కూల్చి వేతలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను నేలమట్టం చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com