HYDRA : మూసీ పరీవాహంలో హైడ్రా కూల్చివేతలు

HYDRA : మూసీ పరీవాహంలో హైడ్రా కూల్చివేతలు
X

మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు మరోసారి సంచలనం రేపుతున్నాయి. మేడ్చల్ జిల్లా పీర్జాదీకూడలో రోడ్డును కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. మేడిపల్లి సర్వే నంబర్ 26ఏ, సీపీఆర్‌ఐ పవర్ సంస్థ, సేజ్‌ స్కూల్ ప్రాంగణంలో ఆర్‌ఏఆర్‌ కాలనీకి సంబంధించిన రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని కాలనీవాసులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో సీఐ సైదులు నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమణలను పూర్తిగా నేలమట్టం చేశారు.

Tags

Next Story