HYDRA : హైదరాబాద్ పరిధిలో 23 ప్రాంతాల్లో కూల్చివేత: హైడ్రా

HYDRA : హైదరాబాద్ పరిధిలో 23 ప్రాంతాల్లో కూల్చివేత: హైడ్రా
X

చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఆక్రమణలను తొలగించేందుకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు హైదరాబాద్‌ పరిధిలో 23 ప్రాంతాల్లో ఆక్రమణలు కూల్చివేసినట్లు హైడ్రా ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 262 నిర్మాణాలు కూల్చివేసి, 111.72 ఎకరాల భూమి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. కూల్చివేత‌ల‌తో దూసుకెళుతున్న హైడ్రాకి ప్రభుత్వం మరో కీలక బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. ప్ర‌భుత్వం మంజూరు చేసే బిల్డింగ్ ప‌ర్మిష‌న్ల ప్ర‌క్రియ‌లోనూ హైడ్రాను చేర్చే యోచ‌న‌లో సీఎం రేవంత్​ యేచిస్తున్నట్టు సమాచారం. ఇళ్ల నిర్మాణాల‌కు హైడ్రా వ‌ద్ద కూడా ఎన్ఓసీ పొందాల‌నే కొత్త నిబంధ‌న దిశ‌గా ప్ర‌భుత్వం ముందడుగు వేస్తోంది.

Tags

Next Story