HYDRA Team : బెంగళూరుకు వెళ్లిన హైడ్రా టీమ్

X
By - Manikanta |8 Nov 2024 8:00 PM IST
చెరువుల పునరుద్ధరణ, విపత్తు నిర్వహణపై అధ్యయనానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ బృందం బెంగళూరుకు బయలుదేరి వెళ్లింది. మూడు రోజుల పాటు బెంగళూరులోని చెరువుల పునరుద్ధరణపై అధ్యయనం చేయనున్నారు . బెంగళూరు కోర్ సిటీలో ఉన్న చెరువులను సందర్శిస్తారు. కర్ణాటక ట్యాంక్ కన్జర్వేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ చేసిన చెరువులను సందర్శించి అక్కడ అమలు చేసిన ఉత్తమ విధానాలు, టెక్నాలజీని తెలుసుకోనున్నారు. తెలంగాణ సర్కార్ హైదరాబాద్ నగరంలోని ఐదు చెరువులను పునరుద్ధరించాలని ఆదేశించింది. ఈనేపథ్యంలో ఆ దిశగా హైడ్రా చర్యలను వేగవంతం చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com