KTR : కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చే దిశగా హైడ్రా అడుగులు

KTR : కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్ కూల్చే దిశగా హైడ్రా అడుగులు
X

రంగారెడ్డి జిల్లాలోని పలు ఫామ్ హౌస్ ల అక్రమ నిర్మాణాలపై తమకు ఫిర్యాదు అందే దిశగా హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఫాం హౌస్ లలో నిబంధనల మేరకే అక్కడ నిర్మాణాలు జరిగాయా? లేదా? అన్న కోణంలో హైడ్రా అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు ఆధారాలు లభిస్తే, వెంటనే ఫామ్ హౌస్ ను కూల్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు అందిన వెంటనే ఆయా నిర్మాణాలను గుర్తించి, హైడ్రా యుద్ధప్రాతిపదికన నేలమట్టం చేస్తోంది. అందులో భాగంగా 111 జీవోను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టిన జన్వాడ ఫామ్ హౌస్ ను సైతం కూల్చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా ఫామ్ హౌస్ పై అందిన ఫిర్యాదులపై ఆయా ఫామ్ హౌస్ నిర్మాణాల కోసం ఏ ఏ శాఖల నుంచి అనుమతులు ఇచ్చారనే కోణంలో హైడ్రా అధికారులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.

అప్పట్లో అధికారులు ఇచ్చిన అనుమతుల మేరకే నిర్మాణాలు జరిగాయా? లేకపోతే జీవో 111 ను ఉల్లంఘించారా? అనే కోణంలో హైడ్రా అధికారులు హెచ్ఎండీఏ, పీసీబీ, ఇరిగేషన్ శాఖల నుంచి నివేదిక కోరినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టిన ఫామ్ హౌస్ ను నేలమట్టం చేస్తామని హైడ్రా అధికారులు తేల్చిచెబుతున్నారు.

Tags

Next Story