MLC Kavitha : కన్ఫ్యూజన్ లో లేను... క్లారిటీతోనే ఉన్నా : ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : కన్ఫ్యూజన్ లో లేను... క్లారిటీతోనే ఉన్నా : ఎమ్మెల్సీ కవిత
X

తాను కన్ఫ్యూజన్ లో లేనని, క్లారిటీతోనే ఉన్నానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. కాంగ్రెస్ మునిగే నావ అని, ఆ పార్టీలో చేరబోనని చెప్పారు. రాహుల్ గాంధీ కరెక్టుగా ఉంటే దేశానికి బీజేపీ దరిద్రం పట్టకపోయేదని అన్నారు. తనకు కొత్త పార్టీ అవసరం లేదని, ఉన్న పార్టీని కాపాడుకుంటేచాలని అన్నారు. తాను అమెరికాకి వెళ్లే 20 రోజుల ముందు నుంచి వరుసగా తనపై కుట్రలు మొదలయ్యాయని అన్నారు. ఈ విషయాన్ని అప్పుడే చెప్పానని అన్నారు. అమెరికాకి పొయ్యి వచ్చేలోపు ఆ కుట్రలు చేసేశారని చెప్పారు. పార్టీలో కోవర్టుకు ఎవరు.. ఎందుకు వాళ్ళను కట్టడి చేయడం లేదని ప్రశ్నించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇస్తానని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్థాపించిన సాంస్కృతిక విభాగమే జాగృతి అని అన్నారు. అప్పుడు చురుగ్గా పనిచేశామని తర్వాత కేసీఆర్ సూచనలో స్లో అయ్యామని అన్నారు. ఇప్పుడు మళ్లీ రేవంత్ లాంటి ఉద్యమ ద్రోహి సీఎంగా ఉండడంతో మళ్లీ ఆక్టివ్ చేస్తున్నామని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని, తల వంచనని క్లారిటీ ఇచ్చారు.

Tags

Next Story