Revanth Reddy : కామారెడ్డిలో నేను ఓడి కేసీఆర్ ను ఓడించా.. రేవంత్ ఆసక్తికర ప్రకటన

తెలంగాణ జాతిపిత అని బీఆర్ఎస్ నేతలు చెప్పే కేసీఆర్ ను కామారెడ్డిలో ప్రజలు ఓడించి బండకేసి కొట్టారని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. తాను ఓడిపోతూ పోతూ.. కేసీఆర్ ను కూడా పట్టుకుపోయానని చెప్పారు. తనకు ఓటమి కొత్త కాదని, ఓడిపోయి గెలుస్తూ వస్తున్నానని గుర్తుచేశారు. మూసీ ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, ఆర్ ఆర్ ఆర్ నిర్మాణం తదితర ప్రాజెక్టులను బీఆర్ఎస్ నేతలు వద్దంటారా?, చేపట్టమంటారా..? చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పది నెలల పాలనలో రాష్ట్రా నికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. విప్రో, కాగ్నిజెంట్ తదితర సంస్థలు తమ వ్యాపారాలను హైదరాబాద్లో విస్తరించాయని గుర్తు చేశారు. పదేళ్లు పాలించిన కేటీఆర్ 20వేలకోట్ల పెట్టుబడులు తెస్తే తాము పది నెలల్లోనే 2లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com