Etela Rajender : పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టా: ఈటల

Etela Rajender : పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టా: ఈటల
X

హైడ్రా, మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. రియల్టర్ల పేరుతో కొందరు దౌర్జన్యాలకు దిగుతున్నారని, పహిల్వాన్లను పెట్టి స్థానికులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పోచారం ఘటనపై కలెక్టర్, సీపీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టినట్లు చెప్పారు. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే DOPTకి ఫిర్యాదు చేస్తామని ఈటల హెచ్చరించారు. ఏకశిలానగర్‌ భూదందాలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. మరోవైపు మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదైంది. ఏకశిలనగరంలో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా తనపై దాడి చేశారని గ్యార ఉపేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Next Story