TG : బతికున్నంతవరకు అండగా ఉంటా

TG : బతికున్నంతవరకు అండగా ఉంటా
X

బతికున్నంతవరకు అండగా ఉంటానని అన్నారు ప్రభుత్వ విస్ శ్రీనివాస్ ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాను.. నాకు పదవి, అధికారం లేకున్నప్పటికీ సొంత బిడ్డలాగా ఆదరించారు. ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందాలనేది నా ఆశ.. అందుకే నేను గెలిచి 11 నెలలుగా అయింది.. ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ప్రతిరోజు మీ మధ్యలోనే ఉండి.. మీకు సేవ చేస్తున్న... బతికున్నంతవరకు మీకు అండగా ఉంటా” అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావు పేట మండలం మంగళపల్లిలో రూ. కోటి 30 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి, రూ. కోటి 90 లక్షలతో కొలనూరు రామన్నపేట మధ్య రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేముల వాడకు సీఎం వచ్చిన రోజు జిల్లాకు వరాల జల్లు కురిపించారని తెలిపారు. ఎన్నికల ముందు మీకు ఇచ్చిన మాట ప్రకారం మీలో ఒకడిగా ఉంటూ మీ కుటుంబ సభ్యుడిగా మీ సమ స్యలను పరిష్కరమే ధ్యేయంగా ముందుకు పోతున్నట్లుగా ఆయన తెలిపారు. మధ్య తరగతి భావజాలం ఉన్నవారి చేతిలో పదవి ఉంటే సామాన్య ప్రజానీకానికి మేలు జరుగుతుందని అనడానికి ఇదే నిదర్శనం. 13 పనులకు రూ.13 కోట్ల 40 లక్షలతో వివిధ పనులకు శంకుస్థాపన చేశాం. ప్రజా ప్రభుత్వం లో ప్రజలకు ఉపయోగపడే స్కీంలకు తీసుకొస్తు న్నం. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేశాం. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ.. 200 యూనిట్ల వరకు ఫ్రీకరెంట్ ఇస్తున్నం. గత ప్రభుత్వం రుణమాఫీ ని కిస్తీల్లో కట్టింది. దేశ చరిత్రలోనే ఒక సాహసో తమైన నిర్ణయం తీసుకొని దేశానికి తెలంగాణ ఒక రోల్మెడల్ ఉండేలా రైతు రుణమాఫీ చేశాం. వేములవాడ ఆలయ అభివృద్ధి, రోడ్డు వెడల్పు, ముంపు గ్రామాల ప్రజలకు 4696 ఇం దిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది ' అని ఆది శ్రీనివాస్ అన్నారు.

Tags

Next Story