Harish Rao : లక్ష కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను : మాజీ మంత్రి హరీశ్ రావు

Harish Rao : లక్ష కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను : మాజీ మంత్రి హరీశ్ రావు
X

మిస్టర్ రేవంత్ రెడ్డి.. మీరు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, తాను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపనని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. 'అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజాల పక్షాన మీమ్ముల్ని ప్రశ్నిస్తున్నందుకు భరించలేక, సహించలేక నాపై అక్రమకేసులు బనాయిస్తున్నారు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం. రుణమాఫీ విషయంలో దే వుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తు న్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నం దుకు బేగం బజార్ పోలీసు స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టించినవు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పో స్టు కు సైబర్ క్రైం పోలీసు స్టేషన్ లో నా మీద సంబం ధం లేని కేసు పెట్టించినవు. పార్టీ కార్యక్రమం లో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసు మానకొండూరులో అక్ర మంగా పెట్టించినవు. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిల దీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్ లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను' అని చెప్పుకొచ్చారు.

Tags

Next Story