KTR : చర్యలు తీసుకోకపోతే సుప్రీంకే : కేటీఆర్

ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పీటీషన్లపై శాసన సభాపతి ఏ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు మెట్లెక్కుతామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ స్పష్టంచేశారు. స్వీకర్ను కోర్టు ఆదేశించే అధికారం లేదని మొన్నటి వరకు అన్నారని, అయితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ అనర్హత పిటీషన్ల వ్యవహారంపై స్పందించిందన్నారు. రీజనల్ పీరియడ్లో పరిష్కారించాలని సూచించిన విషయాన్ని కేటిఆర్ గుర్తుచేశారు. శుక్రవారం తెలంగాణభవన్లో మీడియా సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్న లకు కేటిఆర్ స్పందించారు. మణిపూర్ విషయంలో సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అంశంపై స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు. ఇక్కడ కూడా స్వీకర్ మూడు నెలల కాలంలో ఫిరాయింపుల అంశంపై చర్యలు తీసుకోకపోతే సుప్రీంను ఆశ్రయించక తప్పదన్నారు. అదానీతో కేటిఆర్ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నారని అడగ్గా, ఫోటోలు దిగింది వాస్తమే అని అయితే గత తమ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు అదానీతో చేసుకోలేదన్నారు. ఏ ప్రతి పాదనతో అదానీ మీ ముందుకు వచ్చారని అడగ్గా అప్పుడు ఏదో జరిగిపోయింది ఇప్పుడు అదెందుకు అంటూ కేటిఆర్ దాటవేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రశ్నించిగా ఆయన వాగుడుకు, మొరుగుడుకు అర్థమేమీ ఉండదని, ఇప్పుడది ప్రధానాంశం కాదని, అదానీ అంశంపైనే దృష్టిపెట్టి రేంత్రెడ్డిని, రాహుల్ గాంధీని, బిజెపి నేతలను బిఆర్ఎస్ లేవనెత్తిన అంశాలపై ప్రశ్నించి సమాధానాలు రాబట్టాలని కేటిఆర్ మీడియాను కోరారు. అదానీ వ్యవహారంలో ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే విషయంలో మీడియా ప్రజల పక్షాన పనిచేస్తోందని కేటిఆర్ కితాబు ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com