TG : తప్పు చేస్తే.. ఎవరినైనా వదిలిపెట్టం : మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ రాజ్యంలో తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టమని, చిన్నదొరకైనా, పెద్దదొరకైనా శిక్ష తప్పదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పచ్చకామెర్లు వచ్చి నోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నాడని ఫైర్అయ్యారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న తమకు ప్రతి మాటకు స్పందిచాల్సిన అవసరం లేదన్నారు. కార్ల రేసింగ్తో తెలంగా ణకు వచ్చిన ప్రయోజనం ఏంటి? అని మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. కేటీఆర్ పాదయాత్రను స్వాగతిస్తామని తెలిపారు. తప్పులు చేసినవారు భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు. ఖమ్మం రూరల్ మండలం కోట నారాయణపురంలో సమగ్ర కుటుంబ సర్వేని పొంగులేటి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత ఎవరైనా సరే తప్పు చేసినట్టు తేలితే శిక్ష తప్పద ని వార్నింగ్ ఇచ్చారు. 75 కాలమ్స్ తో కులగణన సర్వే చేస్తున్నారని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేతో ఎవరికి ఏమేం అవసరం ఉన్నాయో ప్రభుత్వానికి తెలుస్తుందన్నారు. మేఘా కంపెనీకి బీఆ ర్ఎస్ రెడ్ కార్పెట్ వేసిందని కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సి వస్తే పెడతామన్నారు. అంతకుముందు నేలకొండపల్లి మండలం అనంతనగర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను సందర్శించి.. విద్యార్థినులతో మధ్యాహ్న భోజనం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com