TG : సాధారణ ప్రసవాలు చేసిన నర్సులకు ప్రోత్సాహకాలు

TG : సాధారణ ప్రసవాలు చేసిన నర్సులకు ప్రోత్సాహకాలు
X

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతోపాటు పుట్టిన వెంటనే శిశువులకు తల్లిపాలు పట్టించడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్న నర్సులు, నర్సింగ్ ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహకాలను ప్రకటించింది. సంవత్సరానికి 100 సాధారణ ప్రసవాలను చేసిన వారికి ప్రోత్సహాకాలను అందిస్తున్నట్లు ప్రత్యేక సర్క్యలర్ ను జారీ చేసింది.

ఇందుకు రాష్ట్రంలోని 35 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సింగ్ స్టాఫ్ కు ఇన్సెంటివ్స్ ను విడుదల చేసింది. పుట్టిన వెంటనే తల్లిపాలను పట్టించిన నర్సులకు ప్రతి శిశువుకు రూ.200 ప్రోత్సాహకంగా ప్రకటించింది. 92 డెలివరీ పాయింట్ల ప్రాతిపదికన ప్రోత్సహాకాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

Tags

Next Story