Kishan Reddy : ముస్లింలను బీసీల్లో కలపడం రాజ్యాంగ విరుద్ధం : కిషన్ రెడ్డి

ముస్లింలను బీసీల్లో కలపడం రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణనకు తాము వ్యతిరేకం కదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కులగణన మాత్రమే చేసిందని, సెన్సెస్ కాదని అన్నారు. ముస్లింలను బీసీల్లో చేర్చడం, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో మొదటి సారి కుల గణన జరుగుతోందని, ఆది మోదీ గొప్పతన మని అన్నారు. క్యాస్ట్ సెన్సెస్ చేయని తెలంగాణ ఎలా రోల్ మోడల్ అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు తప్ప రూపాయికి చెల్లుబా టుకు పనికిరాని అడ్డమైన వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. భూ సేకరణకు అడ్డుపడుతుండ్రు అంబర్పేట్ ఫ్లై ఓవర్ ను ఈనెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని బీజేపీ స్టేట్ చీఫ్, సెంట్రల్ మినిస్టర్ కిషన్రెడ్డి తెలిపారు. ఇంటి స్థలం సేకరించిన తర్వాత ఒక రాజకీయ పార్టీ అడ్డుపడే ప్రయత్నం చేసిందని ఫైర్ అయ్యారు. కొంత మంది ఫ్లై ఓవర్ను ఆపే పని చేశారని... ఇంకా 6 చోట్ల భూ సేకరణ పూర్తి కాలేదని.. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వానికి, జీహెచ్ఎంసీకి లేఖ రాసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ హయాంలోనే అంబర్పేట్ ఫ్లై ఓవర్కు శంకుస్థాపన జరిగినట్లుగా గుర్తుచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com