Kaleshwaram : కాళేశ్వరంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Kaleshwaram : కాళేశ్వరంలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
X

గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని గోదావరి నది మహారాష్ట్ర నుంచి ప్రవహిస్తున్న ప్రాణహిత నదులు ఉప్పొంగి పొంగడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. త్రివేణి సంగమ గోదావరి నది 6 మీటర్ల ఎత్తు నుండి ప్రవహిస్తుంది. మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లను ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

ప్రాణహిత గోదావరి నదిలో నుండి 5 లక్షల క్యూసెక్కుల నీరువచ్చి మేడిగడ్డ బ్యారెజ్ లో చేరుతుంది. దీనితో పూర్తిస్థాయిలో ఇరిగేషన్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఇలానే మరింత వర్షం కురిస్తే గోదావరి నది మరింత పెరిగే అవకాశం ఉంది.

Tags

Next Story