TG : ప్రజావాణిలో ఇందిరమ్మ 'ఇళ్ల' దరఖాస్తులే ఎక్కువ

TG : ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులే ఎక్కువ
X

ప్రజావాణిలో ఇందిరమ్మ ఇళ్లకు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గ్రామ సభల్లో దరఖాస్తులు చేసుకోని వారు ప్రజా వాణిలో బారులు తీరుతున్నారు. రాష్ట్రం నలుమూల లనుంచి తరలివస్తూ దరఖాస్తులు నమోదు చేసుకుంటున్నారు. మంగళవారం మహాత్మజ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణిలో ఎనిమిది కౌంటర్లలో కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసం 4,860 దరఖాస్తులు నమోదు అయ్యాయి. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు దర ఖాస్తులు స్వీకరించారు. అయితే ఈ దరఖాస్తులను తిరిగి జిల్లా కలెక్టర్లకు పంపించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజావాణిలో 7142 దరఖాస్తులు నమోదు కాగా గ్రామీణాభి వృద్ధి శాఖకు 175, విడ్త్ శాఖకు 135, రెవెన్యూ సంబంధించినవి 46, ప్రవాసీ ప్రజావాణికి 1, ఇందిరమ్మ ఇళ్ల కోసం 4,860 దరఖాస్తులు నమోదుఅయ్యాయి. రేషన్ కార్డులకోసం 1861 దరఖాస్తులు నమోదయ్యాయి. ఇతర శాఖలకు 64 దరఖాస్తులు నమోదు ఇనట్లు అధికారులు తెలిపారు.

Tags

Next Story