Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు.. మొదట వారికే!

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు.. మొదట వారికే!
X

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను మరోసారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశించింది. అనర్హుల పేర్లను తొలగించాలని సూచించింది. దరఖాస్తులను 3 కేటగిరీలుగా (L1, L2, L3) విభజించింది. L1లోకి సొంత స్థలం ఉండి ఇళ్లు లేని వాళ్లు, L2లోకి స్థలం, ఇళ్లు రెండూ లేని వాళ్లు, L3లోకి అద్దె/రేకులు/పెంకుటిళ్లలో ఉన్నవారు వస్తారు. తొలి దశలో L1 కేటగిరీ వారికి ఇళ్లు వస్తాయని సమాచారం.

ఇక ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు పొంది సొంత నిధులతో వాటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న వారికి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక సాయం పూర్తిగా అందని, సగం డబ్బులు పొందిన లబ్ధిదారులకు సాయం చేయనున్నట్లు తెలుస్తోంది. అప్పటి ప్రభుత్వం ఎంత అమౌంట్ ఇచ్చింది, ఇంకెంత ఇవ్వాల్సి ఉందనే వివరాలను హౌసింగ్ శాఖ సేకరించింది. ఇలాంటి లబ్ధిదారులు సుమారు 2 లక్షల మంది ఉంటారని అంచనా.

ఇందిరమ్మ అప్లికేషన్లను మరోసారి వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అప్లికేషన్ ను క్షుణ్నంగా పరిశీలించి లబ్ధిదారులనుఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలను హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన సర్క్యులర్ ను జారీ చేశారు.

Tags

Next Story