CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతం చేయాలి : సీఎం రేవంత్

CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతం చేయాలి : సీఎం రేవంత్
X

నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ పథకం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెడుతుందని.. ఎట్టి పరిస్థిలోనూ అక్రమాలకు తావు లేకుండా అర్హులైన లబ్దిదారులకే ఈ కార్యక్రమాన్ని అమలు చేసి పేద ప్రజల మనసులను గెలుచుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్టు చెబుతున్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణాన్ని వేగవంతం చేసి పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల డిజైన్ ను సింగిల్ బెడ్ రూమ్ గా మార్చడంతో.. ఈ పథకానికి మంచి ఆదరణ వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.

Tags

Next Story