Medigadda : మేడిగడ్డకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

Medigadda : మేడిగడ్డకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో
X

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ కు వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. సోమవారం మేడిగడ్డ బ్యారేజ్ కు ఇన్‌ఫ్లో 8,68,850 క్యూసెక్కులకు పెరిగింది. అయితే, బ్యారేజ్ 85 గేట్లను ఎత్తిన అధికారులు ఇన్ ఫ్లో ఎలా ఉందో అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజ్‌కు 17,200 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Tags

Next Story