Hyderabad : అమానుషం.. బస్టాప్‌లో వృద్ధుడిని వదిలేసి వెళ్లిపోయారు

Hyderabad : అమానుషం.. బస్టాప్‌లో వృద్ధుడిని వదిలేసి వెళ్లిపోయారు
X

మానవత్వం మంటకలుస్తోంది. రక్త సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. ఓ వృద్ధుడిని అతని కుటుంబ సభ్యులు బస్టాప్‌లో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరం ఆల్వాల్‌లో వెలుగు చూసింది. వృద్దుడిని ఆటోలో తీసుకోని వచ్చి అల్వార్ లకడావాలా బస్టాప్ లో కుటుంబ సభ్యులు వదిలేసి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చలిలో వణుకుతున్న ఉన్న అతడిని చుసిన స్థానికులు వివరాలు అడిగారు. తాను సికింద్రాబాద్ కు చెందిన గోవర్ధన్ రెడ్డి అని తెలిపాడు. ఆల్వాల్ పోలీసులు వృద్ధుడి నుంచి వివరాలు సేకరించారు.

Tags

Next Story