TG : స్పీకర్ నోటీసులపై ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో అంతర్మథనం

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపు విషయంలో వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చిన శాసనసభ కార్యదర్శి తాను జారీ చేసిన నోటీసులకు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అసెంబ్లీ కార్యదర్శి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులిచ్చారు. అయితే వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు కోరారు. 2024 మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తోంది. సుప్రీం ఆదేశాలతో స్పీకర్ తాజాగా ఆదేశాలు ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com