Telangana Hotel Incident : ఇడ్లీలో జెర్రి.. గణేశ్ భవన్ ఉడిపి హోటల్ సీజ్

పట్టణంలోని గణేశ్ భవన్ ఉడిపి హోటల్ ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. ఆదివాకం హోటల్ లో ఇడ్లీలో జెర్రి రాగా ఓ మహిళా కస్టమర్ ఆందోళన చేసి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం ఆ హోటల్ లో తనిఖీలు చేశారు. నిబంధనల మేరకు నిర్వహణ లేకపోవడంతో హోటల్ ను సీజ్ చేశారు. ”ఇడ్లీలో జెర్రి వచ్చిందని మాకు ఫిర్యాదు అందింది. అందుకు రెస్పాండ్ అవుతూ మేము హోటల్ లో తనిఖీలు చేశాము. ఇది పబ్లిక్ హెల్త్ ఇష్యూ. కాబట్టి హోటల్ ని సీజ్ చేస్తున్నాము. శానిటరీ మెజర్స్, ఇతర సమస్యలు అన్నీ రెక్టిఫై చేశాకే హోటల్ ను ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇస్తాము. పలు సెక్షన్ల కింద కేసులు బుక్ అయ్యాయి. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా మేము కొన్ని సూచనలు చేశాం. అవన్నీ చేయాల్సి ఉంటుంది. మేము మళ్లీ చెక్ చేస్తాం. మేము సంతృప్తి చెందితేనే మళ్లీ హోటల్ ని ఓపెన్ చేపిస్తాం” అని ఫుడ్ సేఫ్టీ ఇన్ స్పెక్టర్ అనూష తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com