Telangana : పెరుగుతున్న చలి తీవ్రత

తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. రాబోయే అయిదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పొడివాతావరణం నెలకొంటుందని వెల్లడించింది. రానున్న అయిదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని హెచ్చరించింది. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకి పెరిగిపోతుంది. నవంబర్ తొలి రెండు వారాల్లో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత బంగాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తుపాను తరహా వాతావరణంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొంచెం తగ్గింది. ఆకాశంలో మేఘాలు ఉండటంతో పగటి పూట ఉష్ణోగ్రతలు పడిపోయినా చలి తీవ్రత మాత్రం అంతగా లేదు. కానీ వారం రోజులుగా మరోసారి రాష్ట్రంపై చలి పులి పంజా విసురుతోంది. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. తెలంగాణ మీదుగా ఉపరిత గాలులు ఈశన్య దిశలో గంటకు 6-8 కి.మీ వేగంతో బలంగా వీచే అవకాశాలున్నాయని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com