టీబీజేపీలో కల్లోలం.. నేతల మధ్య డైలాగ్ వార్..!

తెలంగాన బీజేపీ నేతల మధ్య ఆధిపత్య పంచాయితీ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ అధిష్టానం ప్రతిసారి హెచ్చరిస్తున్నా సరే ఎవరూ పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. వాస్తవానికి బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అంటారు. కానీ ప్రస్తుతం టీ బీజేపీలో ఇంటర్నల్ ఫైట్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆధిపత్య పోరులో భాగంగా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయినట్టు తెలుస్తోంది. వర్గ పోరుతో నేతల మధ్య వార్ బయట పడుతోంది. పార్టీలో చెలరేగుతున్న అసమ్మతిని చల్లార్చేందుకు ఢిల్లీకి టీబీజేపీ చీఫ్ రామచందర్ రావు వెళ్లారు. అక్కడ ఢిల్లీ పెద్దలతో రామ్ చందర్ రావు చర్చిస్తున్నారు. ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చిన తర్వాత పార్టీలో కీలక మార్పులు ఉంటాయని చెబుతున్నారు.
ఎనిమింది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు కలిసి పోరాడాలని ఢిల్లీ పెద్దలు సూచిస్తున్నా సరే ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదని చెబుతున్నారు. కిషన్ రెడ్డిపై పార్టీ వీడిన రాజాసింగ్ ఎప్పటికప్పుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇంకోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వీరద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎంపీ అరవింద్ మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది.
ఇలా ఎవరికి వారే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు చూస్తుండటంతో రచ్చ కాస్త ముదురుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేతలే ఇలా రచ్చకెక్కుతుండటంతో ఏం చేయలేకపోతున్నారంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. దీంతో నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు త్వరలోనే ఢిల్లీ అధిష్టానం కూడా రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ప్రయత్నాలు ఉంటాయని సమాచారం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
