Telangana : తెలంగాణలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్

Telangana : తెలంగాణలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్
X

తెలంగాణ రాష్ట్రంలోని 93 లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించామన్నారు. సచివాలయంలో తనను కలిసిన ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందానికి ఈ వివరాలు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు గ్రామాలను ఈ బృందం సందర్శించి అనుభవాలను తనతో పంచుకుందని మంత్రి తెలిపారు. రంగారెడ్డి జిల్లా హాజిపల్లి, నారాయణ్ పేట్ జిల్లా మద్దూర్, సంగారెడ్డి జిల్లా సంగు పేట, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ గ్రామాల్లో ఇంటర్నెట్ కనిక్టివిటీ వల్ల స్థానికులకు కలిగిన ప్రయోజనాలను వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు ప్రత్యక్షంగా చూశారన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు కనెక్టివిటీ విస్తరించాలనేది తమ లక్ష్యమన్నారు శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ఇప్పటికే 32 వేల కిలోమీటర్ల పొడవున ఫైబర్ ఆప్టిక్ కేబులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Tags

Next Story