Telangana : నగరంలో నెట్ బంద్... ఇబ్బందులు పడుతున్న ప్రజలు...

విద్యుత్ స్తంభాలకు ప్రమాదకరంగా వేలాడుతున్న కేబుల్ వైర్లను తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన అధికారులు...నగరంలో చాలా చోట్ల కేబుల్లను కట్ చేశారు. విద్యుత్ షాక్ తో పలువురు మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అధికారుల చర్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేబుల్స్ కట్ చెయ్యడంతో నెట్ రాక అవస్థలు పడుతున్నారు. ముఖ్యముగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు, ఆన్లైన్ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ తీరుతో నెట్ ప్రొవైడర్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కేబుల్ కోతల కారణంగా నగరంలోని పెద్ద సంఖ్యలో బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లు ఇంటర్నెట్ రాక ఇబ్బందులు పడుతున్నారని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై COAI డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ స్పందించారు. విద్యుత్ శాఖ కేబుల్స్ విచక్షణారహితంగా కట్ చెయ్యడం వల్ల ప్రజలకు ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడిందన్నారు. “ఇంటర్నెట్ కేబుళ్లలో కరెంట్ ఉండదు. కరెంట్ షాకులకు కేబుల్ వైర్లకు ఎటువంటి సంబంధం లేదు” అని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ చర్యల వల్ల నిత్యావసర సేవ అయిన ఇంటర్నెట్ కనెక్టివిటీకి తీవ్ర అంతరాయాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. దీంతో డిజిటల్ సేవలకు అంతరాయం ఏర్పడిందని.. సమస్యను పరిష్కరించేందుకు ఇంటర్నెట్ సేవల సంస్థలు పని చేస్తున్నాయని COAI తెలిపింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com