TELANGANA: పెట్టుబడుల వెల్లువ..

TELANGANA: పెట్టుబడుల వెల్లువ..
రాష్ట్రంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ TCL తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది.

తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ TCL తన కార్యకలాపాలను ప్రారంభించనున్నది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన రిసోజెట్ సంస్ధతో కలిసి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నది. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో రిసోజెట్‌తో టీసీఎల్ సంస్థ ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచ స్థాయి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

రంగారెడ్డి జిల్లా రావిర్యాల్లో ఉన్న ఈ-సిటీలో ఏర్పాటు చేయనున్న తయారీ యూనిట్ కోసం TCL సంస్ధ 225 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ తయారీ యూనిట్ ద్వారా సుమారు 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు తొలి దశలోనే రానున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి TCL కంపెనీని స్వాగతిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర కంపెనీ అయిన రిసోజెట్ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా TCL కంపెనీతో కలిసి ముందుకు వెళ్లడం విశేషమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి అవకాశం ఉందని.TCL కంపెనీ పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ రంగంలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story