CM Revanth Reddy : 3 లక్షల కోట్ల పెట్టుబడులు లక్షకు పైగా ఉద్యోగాలు : సీఎం రేవంత్ రెడ్డి

దేశీయ, అంతర్జాతీయ పెట్టుబ డులను ఆకర్షించడంలో తెలంగాణ టాప్ లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సొనాటా సాఫ్ట్ వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సొనాటా సాఫ్ట్వేర్ అత్యాధునిక ఏఐ ని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమని చెప్పారు. హైదరాబాద్ మహానగరం సాఫ్ట్వే ర్ రంగంలో, లైఫ్ సైన్సెస్ రంగంలో ఇంకా అనేక రంగాల్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కు హబ్ గా మారిందని చెప్పారు. రాష్ట్రం పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగ సృష్టిలో నంబర్ వన్ గా ఉందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు మూడు లక్షల కోట్ల పెట్టుబడులను తేగలిగా మని, తద్వారా లక్ష కోట్ల ఉద్యోగాలను సృష్టిం చామని సీఎం చెప్పారు. ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరుపొందిన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయని, త్వరలోనే మరిన్ని ఈవెంట్లు నిర్వహించబోతున్నామని సీఎం చెప్పారు. తెలంగాణ సాధించిన విజయాలను అంతర్జాతీయ స్థాయిలో వివరిం చాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బ్రాండ్ అం బాసిడర్లుగా మారాలని కోరారు. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టు బడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోందని సీఎం చెప్పారు. ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com