KCR : కెసిఆర్ బయటకు రాకపోతే నష్టమే..?

KCR : కెసిఆర్ బయటకు రాకపోతే నష్టమే..?
X

మాజీ సీఎం కేసీఆర్ ఇంకా బయటకు రాకపోతే బిఆర్ఎస్ కు భారీ నష్టం తప్పేలా లేదు. కేటీఆర్ ను ముందు ఉంచి రాజకీయ వ్యూహాలు అమలు చేయాలని చూస్తున్న పెద్దగా వర్కౌట్ కావట్లేదు. కంటోన్మెంట్ ఉపఎన్నిక, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దీనికి ప్రధాన సాక్ష్యం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా సరే బిఆర్ఎస్ కు అది ఓట్ల రూపంలో పడట్లేదు. గ్రేటర్ హైదరాబాదులో హైడ్రా కూల్చివేతలు భారీ వ్యతిరేకత తీసుకొస్తాయని అంతా భావించారు. కానీ ఏమైంది.. అదే హైడ్రా కూల్చివేతలు జరిగిన జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటును కోల్పోయింది. వాస్తవానికి కెసిఆర్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్ కేటీఆర్ కు లేదు. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.

కెసిఆర్ ఉండగా కేటీఆర్ ను 100 పర్సెంట్ యాక్సెప్ట్ చేయలేక పోతున్నారు ప్రజలు. బిఆర్ఎస్ పార్టీలో అగ్రనేత ఉండగా.. కేటీఆర్ ను ఆ స్థాయిలో ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఒకవేళ కేసీఆర్ బయటకు వచ్చి ఈ రెండేళ్లుగా ఫీల్డ్ లోనే ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కెసిఆర్ సీఎంగా ఉంటేనే బయటకు వస్తారా.. పదవి లేకపోతే ఫామ్ హౌస్ లోనే ఉంటారా అనే వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తోంది. కాబట్టి ఈ వ్యతిరేకతను ఓవర్ కం చేయాలంటే కచ్చితంగా కేసీఆర్ బయటకు రావాల్సిందే.

పైగా కల్వకుంట్ల కవిత డ్యామేజ్ ను కంట్రోల్ చేయాలంటే కెసిఆర్ బయటకు వచ్చి మాట్లాడితేనే అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు కేసీఆర్ గ్రౌండ్ లెవెల్ లో లేకపోవడం బిఆర్ ఎస్ కు పెద్ద మైనస్ అవుతుంది. రాజకీయ చాణక్యుడైన కేసిఆర్ ఈ రెండేళ్లుగా ఫీల్డ్ లోనే ఉంటే బిఆర్ఎస్ పరిస్థితి వేరేగా ఉండేదేమో. కానీ అలా చేయకుండా ఆయన ఫామ్ హౌస్ లో ఉండి కేటీఆర్ ను ఫీల్డ్ లో తిప్పటం అనుకున్న స్థాయిలో రిజల్ట్ ను ఇవ్వలేకపోతోంది. ఎన్నికలకు ఇంకా ఎంతో దూరం లేదు. కాబట్టి కెసిఆర్ ఇప్పటికైనా బయటకు వచ్చి అన్ని రకాల అనుమానాలను క్లియర్ చేసి ప్రజల మధ్య ఉంటే బిఆర్ఎస్ కు అనుకున్న స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఇలాంటి తడబాట్లు తప్పేలా లేవు.



Tags

Next Story