Harish Rao : హామీపై నిలదీస్తే అక్రమ నిర్బంధాలా : హరీశ్ రావు

ఎన్నికల సమయంలో తమకి చ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ నిలబెట్టు కోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ టౌన్ లో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్ తరలించి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. 'సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తు న్న ముఖ్యమంత్రి.. టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపండి. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోండి. అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామ ని, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి, ఏడాది గడిచినా ఉలుకు లేదు, పలుకు లేదు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా
కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసారు. ఇప్పుడు రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ నిర్బంధా లకు గురిచేస్తున్నారు. ఇది హేయమైన చర్య. తక్షణమే వారిని విడుదల చేయాలి. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా రెగ్యులైరైజేషన్ సహా ఇతర హామీలను నిలబెట్టుకోవాలి' అని డిమాండ్ చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com