KTR : హోంమంత్రి లేకపోతే ఇలానే జరుగుతుంది..? సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

రాష్ట్రంలో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మలక్‌పేట్ లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చందునాయక్‌ను దుండగులు కాల్చి చంపారు. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ అనుమానాస్పద మృతి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే శాంతిభద్రతలపై కేటీఆర్.. ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్ర యంత్రాంగం మొత్తం ప్రతీకార రాజకీయాల కోసం, రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి మాత్రమే పని చేస్తే ఏం జరగుతుందో కళ్లారా చూస్తున్నట్లు తెలిపారు.
దాదాపు రెండేళ్ల పాటు రాష్ట్రానికి ఫుల్ టైమ్ హోంమంత్రి లేకుండా ఉంటే ఏం జరుగుతుంది? సీఎం, అయన బ్రదర్స్ రాష్ట్రాన్ని తమ కంట్రోల్లో ఉన్నట్లు నడిపిస్తే ఏం జరుగుతుంది? ఎటువంటి అనుభవం, అవగాహన లేని వ్యక్తి సీఎం కుర్చీలో కూర్చుంటే ఏం జరుగుతుంది? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రం ఒకప్పుడు శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని.. కానీ కాంగ్రస్ ప్రభుత్వ హయాంలో గడిచిన 24 గంటల్లోనే ఇద్దరు రాజకీయ నాయకులు కాల్చి చంపబడ్డారని మండిపడ్డారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com