Telangana : బీఆర్ఎస్ పెద్దలకు పిలుపు లేనట్టే!

Telangana : బీఆర్ఎస్ పెద్దలకు పిలుపు లేనట్టే!
X

కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ రాజకీయ నాయకులను విచారణకు పిలవద్దనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక బాధ్యతలు వహించిన ఉన్నతాధికారులను, ఈఎన్సీలను విచారించిన కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ లను తొలుత విచారణకు పిలవాలని భావించినప్పటికీ ప్రస్తుతం విరమించుకున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ నాయకులను విచారణకు పిలిస్తే న్యాయసంబంధమైన అంశాలు వస్తాయనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజకీయ నాయకులను పిలవకుండానే విచారణ పూర్తి చేయాలనే నిర్ణయంతో కమిషన్ ఉంది. రాజకీయాలకు అతీతంగా కాళేశ్వరంలో జరిగిన తప్పులను బయటపెట్టాలంటే రాజకీయ లింకుల గురించి వీలైనంత తక్కువ వ్యవహరించాలని కమిషన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిపుణులు, అధికారులు, పరిశోధన సంస్థల నివేదికలను కీలకంగా పరిశీలించి నివేదిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story