Jagga Reddy : హైడ్రాకు జగ్గారెడ్డి వార్నింగ్.. సంగారెడ్డి జోలికి రావద్దంతే!
హైడ్రా అధికారులకు అల్టిమేటం జారీ చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించవద్దని హెచ్చరించారు. హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపలికే పరిమితమన్నారు.ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు హైడ్రా విషయంలో ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని స్పష్టం చేశారు. సంగారెడ్డి ప్రజలకు తాను అండగా ఉంటానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.
హైడ్రా కూల్చివేతలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ మాజీ నేత బక్క జడ్సన్ .. హైడ్రాకు వ్యతిరేకంగా వినూత్న నిరసన వ్యక్తం చేశారు. సెక్రటేరియట్, జీహెచ్ఎంసీ భవనాలు హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో ఉన్నాయంటూ వాటిపై RB-X గుర్తులను బక్క జడ్సన్ వేశారు. సర్వే చేసిన కూల్చివేసే భవనాలపై అధికారులు మార్క్ చేసిన తరహాలో ప్రభుత్వ భవనాలపై RB-X గుర్తులను వేసి నిరసన తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com