Senior Congress Leader : సినిమాగా జగ్గారెడ్డి లవ్ స్టోరీ

Senior Congress Leader : సినిమాగా జగ్గారెడ్డి లవ్ స్టోరీ
X

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, సీనియర్ లీడర్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెండితెరపై కనిపించనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతల్లో ఉన్న ఆయన పార్టీలో యాక్టివ్ ఉంటూనే నటనా రంగంలోకి అడుగుపెడుతున్నారు. 'జగ్గారెడ్డి-ఏ వార్ ఆఫ్ లవ్' పేరుతో సినిమా నిర్మాణం కాబోతోంది. ఆయన నిజ జీవిత పాత్రనే ఆ సినిమాలో జగ్గారెడ్డి పోషించనున్నారు. ఈ ఉగాదికి కథ వింటానని, వచ్చే ఉగాదికి సినిమా విడుదల చేస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అనుమతితోనే సినిమాలో నటిస్తున్నానని, ఈ చిత్రంలో ఇంటర్వెల్ ముందు మొదలయ్యే పాత్ర, ముగింపు వరకు ఉంటుందని చెప్పారు. అయితే, మాజీ ఎమ్మెల్యే నిజజీవితం ఆధారంగా సినిమా వస్తుందనే అంశం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమా రానుందని, తెలుగు, హిందీ భాషల్లో మూవీ చిత్రీకరణ జరుగనుందని టాక్.

Tags

Next Story