Jeevan Reddy : జీవన్ రెడ్డి ఎఫెక్ట్.. కాంగ్రెస్ లో రచ్చ..!

మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎఫెక్ట్ తో కాంగ్రెస్ లో రచ్చ మొదలైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో జీవన్ ఒకరు. ఆయన పదవుల కోసం వేరే పార్టీలోకి ఎన్నడూ వెళ్లలేదు. పైగా ఇప్పుడు కూడా అధికార పార్టీ నుంచి వెళ్లడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేను తీసుకొచ్చి ఆయన వెళ్లిపోయేలా చేశారంటూ జీవన్ రెడ్డి మద్దతు దారులు పార్టీలో మాట్లాడుతున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి.. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వల్ల వెళ్లిపోయినా కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు అంత పట్టు మీద ఉంది అనేది కార్యకర్తల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. వేరే పార్టీ నుంచి వస్తున్న వారి కోసం పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన పెడుతారా అన్నట్టు కొందరు నేతలు మాట్లాడుతున్నారు.
కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం జీవన్ రెడ్డి తొందరపడ్డారని చెబుతోంది. జీవన్ రెడ్డికి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఎన్నో అవకాశాలు ఇచ్చామని చెబుతోంది. ఇప్పుడు కూడా ఆయన్ను వెళ్లిపోకుండా ఆపేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఇంటికి వెళ్లారని.. కానీ ఆయన వినలేదంటూ చెబుతున్నారు పార్టీ నేతలు. జీవన్ రెడ్డి కోసం పార్టీ ఎంతో చేసిందని.. కానీ ఆయన అవన్నీ పట్టించుకోకుండా వెళ్లిపోయారంటూ చెబుతున్నారు.
ఇలా జీవన్ రెడ్డి మీదనే రెండు రకాలుగా కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. అటు బీఆర్ ఎస్ లో జీవన్ రెడ్డి చేరేందుకు ముహూర్తం ఖరారు అవుతోంది. జగిత్యాలలో కాంగ్రెస్ నుంచి బీఆర్ ఎస్ లోకి.. గులాబీ నుంచి హస్తంలోకి ఇలా మార్పులు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి తప్ప వేరే పదవులు లేవు. బీఆర్ ఎస్ లో ఆయన ఏ స్థాయి ప్రభావం చూపిస్తారనేది ఇంకా ఎదురు చూడాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
