Jeevan Reddy : జీవన్ రెడ్డి రాక.. బీఆర్ ఎస్ కు లాభమా..?

Jeevan Reddy : జీవన్ రెడ్డి రాక.. బీఆర్ ఎస్ కు లాభమా..?
X

మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఎట్టకేలకు బీఆర్ ఎస్ లోకి వస్తున్నారు. త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి అందులో జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పాలని బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చూస్తున్నారు. అయితే రీసెంట్ గా ఏ నాయకుడికి ఇవ్వనంత ప్రియారిటీ జీవన్ రెడ్డికి ఇస్తున్నారు. ఇదే ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం. జీవన్ రెడ్డి వస్తే ఉత్తర తెలంగాణలో బీఆర్ ఎస్ పార్టీకి ప్లస్ అవుతుందని అధిష్టానం భావిస్తోంది. జీవన్ రెడ్డి ఒకప్పుడు ఉత్తర తెలంగాణలో పవర్ ఫుల్ లీడర్ గా ఉండేవారు. దాన్ని ఎవరూ కాదనరు. కానీ ఇప్పుడు కాలం మారింది. యూత్ ప్రభావం బాగా పెరిగింది. జీవన్ రెడ్డి వయసు పెరిగిపోతోంది. ఆయన ఇప్పుడు మునుపటిలా రాజకీయాలు చేసే పరిస్థితి కనిపించట్లేదు.

కానీ జీవన్ రెడ్డిని కూడా ఇక్కువ అంచనా వేయడానికి లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన నిఖార్సైన నేత. పార్టీ కోసం అహర్నిషలు పనిచేస్తారు. ఆయన పార్టీ అధిష్టానం నుంచి ఏ ఆదేశాలు వచ్చినా తూచా తప్పకుండా పాటిస్తారు. కాబట్టి ఆ విషయంలో బీఆర్ఎస్ కు జీవన్ రెడ్డి ద్వారా లాభమే జరుగుతుంది. పైగా జీవన్ రెడ్డికి ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మంచి పరిచయాలు, పట్టు ఉంది.

అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచారు. కాబట్టి జీవన్ రెడ్డికి యూత్ లో కూడా పట్టు ఉన్నట్టే చెప్పుకోవాలి. కానీ ఆయన వచ్చే ఎన్నికల వరకు పార్టీలో ఎలా ఇముడుతారు.. ఎలా కలుపుకుని ముందుకు పోతారు అనే విషయాలను ఇక్కడ చర్చించుకోవాలి. అది ఆయన రాజకీయ సత్తా మీదనే ఆధారపడి ఉంటుంది.

Tags

Next Story