TG : రాహుల్ కులం, మతమేంటి? : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

‘కులగణన గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి ఉందా? అసలు ఆయన మతం, కులమేంటి?' అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. దేశ సంస్కృతి సం ప్రదాయాలు ఆయనకి తెలుసా? అన్నారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకం కాదని, అయితే కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రభుత్వం ఈకార్యక్రమంచే పడుతోందని ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ స్టే ట్ ఆఫీసులో మహేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడు తూ 'బీసీ ఓటు బ్యాంక్ కోసమే కాంగ్రెస్ హడావుడి చేస్తోంది. ఇక్కడి కుల గణన పేరు చెప్పి మహారాష్ట్ర లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చేర్చిన 21 హామీలు గాలికి వదిలేశారు. పది మంత్రులు ఉంటే ఇద్దరు బీసీలకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు ఎందుకు? రాహుల్ గాంధీ కులం, మతం ఏంటో ఆయన చెప్పుకోవాలి. అసలు హిందువునా క్రిస్టియానా ! ఫిరోజ్ రాహూల్ జాంగిర్.. గాంధీ ఎలా అవుతారు ? ఆయన గురించి మాట్లాడిన వారిపై కర్ణాటకలో కేసులు పెట్టారు. ఇక్కడి ప్రభుత్వానికి నేనేం భయపడను. పొంగులేటి ఎంక్వైరీ జరుగుతుంది. అవినీతి చేసిన వారెవరూ తప్పించుకోలేరు' అని స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com