JP Nadda: తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూడాలనుకుంటున్నారు- నడ్డా

JP Nadda: తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూడాలనుకుంటున్నారు- నడ్డా
JP Nadda: తెలంగాణాలో డబుల్ ఇంజన్ సర్కారు తీసుకొస్తామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

JP Nadda: తెలంగాణాలో డబుల్ ఇంజన్ సర్కారు తీసుకొస్తామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. టీఆర్ఎస్‌కు దుబ్బాకలో బీజేపీ దమ్కీ ఇచ్చిందని... హుజురాబాద్‌లో గట్టిషాక్‌ ఇచ్చినట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌లో జనం గోస- బీజేపీ భరోసా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు చూడాలనుకుంటున్నారన్నారు. కేసీఆర్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్‌కు ఏటీఎంగా మారిందని నడ్డా తీవ్రంగా విమర్శించారు.

పాలమూరు ప్రజలు తీవ్ర కష్టాల్లోఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్. పాలమూరుపై సీఎం కేసీఆర్‌కు ఎందుకు అంత కక్ష అని వివర్శించారు. ఆర్టీఎస్‌ సమస్యను ఆరు నెలల్లో తీరుస్తానని మాటి ఇచ్చి మరిచిపోయారన్నారు. పాదయాత్రలో భాగంగా జనం గోస-బీజేపీ భరోసా బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆర్టీఎస్‌కు సీఎం సహాకరించాలన్నారు. జీవో 69 ద్వారా నారాయపేట.. కొడంగల్ ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని బండి అన్నారు.

Tags

Next Story